schedule Tuesday, September 08, 2026

పంచాయతి ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం

calendar_today November 30, 2025
person dharshininews
పంచాయతి ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం
పంచాయతి ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం - కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు - జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. కార్యదర్శిని సస్పెండ్ చేస్తున్నట్లు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి మండలం కరీంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-2)గా ఎండీ ఖాజా హమీదుద్దీన్ పనిచేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నికల విధుల్లో ఆయన పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. ఎలెక్షన్ విధులు నిర్వహించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించినందున ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులను ఎలెక్షన్ విధులు సక్రమంగా, నిర్వర్తించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39888/