schedule Tuesday, September 08, 2026

ప్రశాంత పంచాయతి ఎన్నికలకు పటిష్ట చర్యలు

calendar_today December 6, 2025
person dharshininews
ప్రశాంత పంచాయతి ఎన్నికలకు పటిష్ట చర్యలు
ప్రశాంత పంచాయతి ఎన్నికలకు పటిష్ట చర్యలు - 53 కేసుల్లో 130 మంది బైండోవర్ - పెద్దేముల్ ఎస్ఐ శంకర్ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మండల పోలీస్టేషన్ ఎస్ఐ శంకర్ అన్నారు. శనివారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు పెద్దేముల్ మండలంలో 53 కేసుల్లో 130 మందిని బైండోవర్ చేయటం జరిగిందని వెల్లడించారు. మండలంలో తొలి విడతలో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వారిని బైండోవర్ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో బాగoగా ఇప్పటివరకు పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో అసాంఘీక కార్యక్రమాలు జరుగకుండా దృష్టిసారిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎవరైనా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని, అల్లర్లు చెలరేగేలా ప్రవర్తిస్తే కటకటాలు తప్పవని హెచ్చరించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39928/