schedule Tuesday, September 08, 2026

అయ్యప్ప స్వాములు.. రక్తదాతలు..!

calendar_today December 18, 2025
person dharshininews
అయ్యప్ప స్వాములు.. రక్తదాతలు..!
అయ్యప్ప స్వాములు.. రక్తదాతలు..! - భక్తితో పాటు సామాజిక సృహ చాటున్న స్వాములు తాండూరు, దర్శిని ప్రతినిధి : భక్తి కోసం అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు.. రక్తదాతలుగా మారి సామాజిక సృహను చాటుకున్నారు. తాండూరు పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో రక్తనిల్వల పెంపుకోసం తమ వంతుగా రక్తదానం చేశారు. గురువారం తాండూరు పట్టణంలో పాలనిమలై ఆశ్రమం మహేష్ గురు స్వామి, వీఫర్‌యూ ఫౌండేషన్ సిద్దార్థ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిభిరంలో స్వాములు వీరారెడ్డి, భువనేశ్వర్ రెడ్డి స్వామి, గోవర్ధన్ రెడ్డి గురు స్వామి, సత్యనారాయణ రెడ్డి స్వామి, శ్రీకాంత్, రమేష్, ముఖేష్‌, ప్రవీణ్ రెడ్డి, వెంకట్ స్వామి తదితరులు 20 మందికి పైగా రక్తదానం చేశారు. స్వాములు, ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఒక మనిషి ప్రాణాలు కాపాడవచ్చు అని ఎవరికి ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా మేము రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు రక్తనిధి కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40090/