schedule Tuesday, September 08, 2026

మున్సిపల్‌కు రెడీ..!

calendar_today December 27, 2025
person dharshininews
మున్సిపల్‌కు రెడీ..!
మున్సిపల్‌కు రెడీ..! - ఎన్నికల రూపకల్పనపై కసరత్తు - ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్..? - ప్లాన్‌లకు సిద్దమవుతున్న పార్టీలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో తరువాత జరిగే ఎన్నికలపైనే అందరి దృష్టి ఏర్పడింది. పల్లె పోరు తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరు భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మున్సిపల్‌ ఎన్నికలకే వెళ్లాలని భావిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల రూపకల్పన కోసం ఎన్నికల కమీషన్‌ కసరత్తును ప్రారంభించినట్లు రాజకీయ పార్టీ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా రూపకల్పనపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. జనవరి రెండో వారం నాటికి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేలా కార్యాచరణ రూపొందించారు. ప్లాన్‌లకు సిద్దమవుతున్న పార్టీలు వికారాబాద్‌ జిల్లాలో వికారాబాద్, పరిగి, కోడంగల్‌, తాండూరు మున్సిపాల్టీలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య హోరా హోరీ కొనసాగింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తాను చాటుకునేందుకు పార్టీలు సన్నద్దమవుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు, రాబోయే సాధారణ ఎన్నికలకు ముందే పట్టణ ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ఈ ఎన్నికలను అధికార పార్టీ ఒక 'సెమీఫైనల్'గా భావిస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్..? ఫిబ్రవరి రెండో వారం నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి పనులపై పూర్తిపై దూకుడు పెంచడంతో ఎన్నికలు ఖాయమని కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితా తయారీ, వార్డుల విభజన వేగవంతం చేయనున్నారు. దీంతో వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ పార్టీలలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40229/ https://www.dharshininews.com/40226/