ప్రజా పాలనలో కొత్త పుంతలు..!
December 27, 2025
dharshininews
ప్రజా పాలనలో కొత్త పుంతలు..!
- సంక్షేమ పథకాల అమలు కోసం కోర్ కమిటీలు
- తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి
- సందడిగా ప్రజా సమస్యలపై సమావేశాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలనను పకడ్బందీగా అమలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి చేసేందుకు కొత్త పుంతలు తొక్కించేందుకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టి సారించారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే అధికారులను పంపించేందుకు కోర్ కమిటీలను ఏర్పాటు చేశారు. గత నెల తాండూరు మున్సిపల్ పరిధిలో స్థానిక నాయకుల ద్వారా కోర్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వార్డ్ లలో మరో వార్డు కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సభ్యులను వార్డ్ ఆధికారులకు అనుసంధానం చేసి సమస్యలను పరిష్కారించే విధంగా ప్రణాళికలు రచించారు.
ఇదుంలో భాగంగా శనివారం తాండూరు పట్టణంలో పలు వార్డుల్లో అధికారులతో కలిసి కోర్ కమిటిలతో సమావేశలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలు సందడిగా ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో ఆయా వార్డులలో ఉన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయించారు.
దీంతో పాటు గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతితో పాటు పలు సంక్షేమ ఫథకాలపై చర్చించి ఇంకా ఎవరైన మిగిలిపోయిన అర్హులు ఉంటే వారిని గుర్తించి సంక్షేమ ఫథకాలు అందే విధంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశాల ద్వారా అధికారులను ప్రజలకు మరింత దగ్గరవ్వడంతో పాటు సమస్యల పరిష్కారంకు దృష్టిసారించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి జేజేలు పలుకుతున్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40231/