schedule Thursday, September 03, 2026

రైతు సంక్షేమానికి కృషి చేయండి..!

calendar_today August 10, 2026
person dharshininews
రైతు సంక్షేమానికి కృషి చేయండి..!
రైతు సంక్షేమానికి కృషి చేయండి..! - మార్కెట్ కమిటి ద్వారా మెరుగైన సేవలు అందించాలి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - ఎమ్మెల్యేను కలిసిన కొత్త పాలకవర్గం తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతు సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మార్కెట్ కమిటి నూతన పాలకవర్గానికి సూచించారు. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా వడ్డె శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా షేక్ ఖాసిం, డైరెక్టర్లు నియామకం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. తమకు పదవులు కేటాయించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్‌ కమిటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందేలా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించడంతో పాటు మార్కెట్‌ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, మార్కెట్‌లో సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఇందుకు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తామని చైర్మన్, పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కరణం పురుషోత్తంరావు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/44132/