schedule Thursday, September 03, 2026

తాండూరులో ఎస్‌ఐఆర్‌.. 74శాతం..!

calendar_today August 11, 2026
person dharshininews
తాండూరులో ఎస్‌ఐఆర్‌.. 74శాతం..!
తాండూరులో ఎస్‌ఐఆర్‌.. 74శాతం..! - 1.86 లక్షల ఫారాల డిజిటలైజేషన్‌ - పెద్దేముల్ టాప్, టౌన్ బాటమ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)-2026 తాండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో డిజిటలైజేషన్‌ 73.98 శాతానికి చేరుకుంది. మొత్తం 2,52,235 మంది ఓటర్లకు 1,86,613 ఫారాల డిజిటలైజ్‌ పూర్తి అయ్యింది. పెద్దేముల్‌ టాప్‌.. అర్బన్‌ బాటమ్‌ మండలాల వారీగా చూస్తే పెద్దేముల్‌ 81.90 శాతం డిజిటలైజేషన్‌తో నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కొటేపల్లి 81.06 శాతం, యాలాల్‌ 78.41 శాతం, బషీరాబాద్‌ 76.92 శాతం, తాండూర్‌ రూరల్‌ 74.52 శాతం డిజిటలైజేషన్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాండూర్‌ అర్బన్‌ మాత్రం 64.44 శాతంతో చివరి స్థానంలో ఉంది. తాండూరు పట్టణంలో మొత్తం 73,959 మంది ఓటర్లు ఉండగా.. 47,661 ఎన్్యూమరేషన్‌ ఫారాలు మాత్రమే డిజిటలైజ్‌ అయ్యాయి. దీంతో ఇంకా సుమారు 26,298 ఫారాలు డిజిటలైజ్‌ చేయాల్సి ఉంది. 1.86 లక్షల ఫారాల ధ్రువీకరణ బూత్‌ లెవల్‌ అధికారులు (BLOలు) ఇప్పటివరకు 1,86,563 ఎన్్యూమరేషన్‌ ఫారాలను ధ్రువీకరించారు. వీటిలో 1,13,516 ఫారాలను ‘ప్రొజెనీ’గా, 65,581 ఫారాలను ‘సెల్ఫ్‌’గా మ్యాపింగ్‌ చేశారు. మరో 7,466 ఫారాలకు ఇప్పటివరకు మ్యాపింగ్‌ జరగలేదు. అదేవిధంగా 10,767 మంది మృతిచెందినవారు, 31,289 మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లినవారు, 8,611 మంది ఇప్పటికే నమోదైనవారు, 14,114 మంది గైర్హాజరైనవారు, 841 మంది ఇతర కేటగిరీలో ఉన్నట్లు గణాంకాల్లో నమోదైంది. మొత్తానికి సుమారు 60వేల ఓటర్ల తొలగింపు జరిగే అవకాశం ఉంటుందని చర్చించుకుంటున్నారు. 269 పోలింగ్‌ కేంద్రాలు తాండూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 269 పోలింగ్‌ స్టేషన్లు, 2,52,235 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఎన్్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయింది. అయితే ఫారాల డిజిటలైజేషన్‌లో ఇంకా 26.02 శాతం పని మిగిలి ఉంది. ముఖ్యంగా తాండూర్‌ అర్బన్‌లో డిజిటలైజేషన్‌ వేగం పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. మండలాల వారీగా డిజిటలైజేషన్‌ - పెద్దేముల్‌: 81.90% - కొటేపల్లి: 81.06% - యాలాల్‌: 78.41% - బషీరాబాద్‌: 76.92% - తాండూర్‌ రూరల్‌: 74.52% - తాండూర్‌ అర్బన్‌: 64.44% https://www.dharshininews.com/44136/