schedule Thursday, September 03, 2026

చేయూత అర్హులకు సాయం..!

calendar_today August 12, 2026
person dharshininews
చేయూత అర్హులకు సాయం..!
చేయూత అర్హులకు సాయం..! - బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ప్రత్యేక చొరవ - 8వ వార్డులో ఇంటింటికీ వెళ్లి నూతన పింఛన్ దరఖాస్తుల నమోదు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం అమలు చేయబోతున్న చేయూత అర్హులు పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా.. వారి ఇంటి ముంగిటకే వెళ్లి సేవలందిస్తున్నారు 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ హుస్సేన్. నూతన పింఛన్ల కోసం అర్హులైన వారిని గుర్తిస్తూ వార్డులో ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులను నింపుతూ వారికి అండగా నిలుస్తున్నారు. పింఛన్ పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్న వారికి స్వయంగా వివరాలు అందిస్తూ, అవసరమైన పత్రాలు, వివరాల నమోదులో సహకరిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు. అర్హుడైన ఒక్కరూ పింఛన్‌కు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయిస్తున్నట్లు కౌన్సిలర్ జావీద్ హుస్సేన్ తెలిపారు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ సాయి, పింటూ, అంజి, మహేష్ తదితరులు పాల్గొని దరఖాస్తుల ప్రక్రియలో సహకరించారు.   https://www.dharshininews.com/44148/