schedule Wednesday, September 09, 2026

షిర్డిలో శంకర్ యాదవ్‌కు సత్కారం

calendar_today December 20, 2021
person dharshininews
షిర్డిలో శంకర్ యాదవ్‌కు సత్కారం
షిర్డిలో శంకర్ యాదవ్‌కు సత్కారం - శాలువాతో సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్‌కు షిర్డీలో గౌరవం లభించింది. రెండు రోజుల క్రితం శంకర్ యాదవ్ తన మిత్రబృందంతో కలిసి షిర్డీకి వెళ్లి సాయి నాథున్ని దర్శించుకున్నారు. సోమవారం షిర్డీ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు, ట్ర‌స్టు స‌భ్యులు శంకర్ యాద‌వ్‌ను ఘనంగా సన్మానించారు. షిర్డీలోని ఆలయానికి శంకర్ యాదవ్‌ భారీ ఎత్తున విరాళాలు ప్రకటించడం పట్ల ఆలయ కమిటి సభ్యులు, పూజారులు ఈ సన్మానం నిర్వహించారు. అంతకుముందు శంకర్ యాదవ్‌తో పాటు ఆయన వెంట వచ్చిన మిత్రబృందానికి ఆలయ కమిటీ సభ్యులు షిర్డీ సాయినాథుని దర్శనభాగ్యం కల్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ సాయి నాథుని సన్నిధిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సుకృతమన్నారు. కరోనా తొలగిపోయి.. తాండూరు ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని సాయిబాబను ప్రార్థించినట్లు వెల్లడించారు. ఆయన వెంట మాజీ డీపీసి సభ్యులు పట్లోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు బంటు మల్లప్ప, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి, విజయ్ కుమార్, రాములు యాదవ్, ప్రేమ్ కుమార్, రఘునాథ్ రెడ్డి, నర్సింలు గౌడ్, సిరిగిరిపేట్ రాజు తదితరులు ఉన్నారు.