schedule Thursday, September 03, 2026

కాంగ్రెస్‌తోనే సంక్షేమ రాజ్యం..!

calendar_today January 28, 2022
person dharshininews
కాంగ్రెస్‌తోనే సంక్షేమ రాజ్యం..!
కాంగ్రెస్‌తోనే సంక్షేమ రాజ్యం..! - చేవేళ్ల పార్లమెంట్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రెడ్డి - తాండూరులో జోరుగా సభ్యత్వ నమోదు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : రాష్ట్రంలో కాంగ్రెస్తోనే సంక్షేమ రాజ్యం సాధ్యమవుతుందని ఆ పార్టీ చేవేళ్ల పార్లమెంట్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని 2వ వార్డు, 20 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదును చేపట్టారు. కార్యక్రమానికి పార్టీ చేవేళ్ల పార్లమెంట్ కోఆర్డినేటర్ సత్యనారాయణ రెడ్డి హాజరై కార్యకర్తల నుంచి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పాలనలో సంక్షేమ రాజ్యం నిర్మాణమవుతుందని అన్నారు. అదేవిధంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ద్వారా తాండూరులో అత్యధిక సభ్యత్వ నమోదుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకవస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మధుబాల, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, ప‌ట్ట‌ణ ఉపాధ్యక్షులు రాము, నాయకులు సయ్యద్ షుకూర్, సమద్, జలీల్, భీంశంక‌ర్, అంబదాస్ తదితరులు పాల్గొన్నారు.