schedule Thursday, September 03, 2026

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌రం

calendar_today March 9, 2022
person dharshininews
ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌రం
ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌రం - ప‌దేళ్ల‌కు వ‌యోప‌రిమితి పెంపు దర్శిని డెస్క్ : రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో వ‌రాన్ని ప్ర‌క‌టించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని పదేండ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. దీనివల్ల మరింతమంది ఉద్యోగార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఓసీలకు 44 ఏండ్లకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లకు, దివ్యాంగులకు 54 ఏండ్లకు గరిష్ట వయోపరిమితి పెరుగుతుందన్నారు. కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ ఉండదని, ప్రతి ఏడాది ఉద్యోగాల ఖాళీలను గుర్తించి పారదర్శకంగా నియామకాలు చేపడతామని కేసీఆర్ పేర్కొన్నారు.