schedule Thursday, September 03, 2026

ది కశ్మీర్ ఫైల్స్‌కు పోటెత్తిన కమల దళం

calendar_today March 19, 2022
person dharshininews
ది కశ్మీర్ ఫైల్స్‌కు పోటెత్తిన కమల దళం
ది కశ్మీర్ ఫైల్స్‌కు పోటెత్తిన కమల దళం - ప్రేక్షకులకు నాయకులకు ప్రత్యేక షో - ప్రదర్శనకు మద్దతు ఇచ్చిన బీజేపీ నేత యు.రమేష్ కుమార్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : దేశ వ్యాప్తంగా సంచలనమై ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు తాండూరులో భారీ ఆదరణ లభించింది. శనివారం బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ లక్ష్మీమహాల్ థియేటర్లో ప్రత్యేక షో వేయించారు. కశ్మీర్లో హిందూ పండితులపై జరిగిన ఆఘాయిత్యాలు, మారణ హోమాలు కళ్లకు కట్టినట్లు చూపించడంతో సినిమాను చూసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. థియేటర్లో 624 మందికే కుర్చీలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు భారీగా పోటెత్తడంతో అభిమానులు, ప్రజలు కొంతమంది నిలబడి చిత్రాన్ని వీక్షించారు. సినిమా ప్రారంభానికి ముందే థియేటర్ భారత్ మాతాజీ జై.. ఛత్రపతి శివాజీ జై.. అంటూ నినాదాలతో హోరెత్తింది. యు.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, పార్టీ నాయకులు సంయుక్తంగా భారతమాత ప్రార్థనా గీతాన్ని ఆలాపించి దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం చిత్ర ప్రదర్శన ముగిసిన తరువాత ఈ చిత్ర ప్రదర్శనకు యు.రమేష్ కుమార్ పూర్తి మద్దతును అందజేశారు. ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రేక్షకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కశ్మీర్లో జరిగిన మారణహోమాన్ని ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా చూపించడం అభిందనీయమన్నారు. గత ప్రభుత్వాలు కుట్రలు ఈ చిత్రం ద్వారా అందరికి తేటతెల్లం చేశాయన్నారు. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అందరు సినిమాను చూసి ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగారం నర్సింలు, పూజారి పాండు, బంటారం భద్రేశ్వర్, సుదర్శన్ గౌడ్, మ‌హిళ మోర్చ రాష్ట్ర నాయ‌కురాలు అంతారం లలిత, మ‌హిళ మోర్చ జిల్లా అధ్య‌క్షురాలు సాహు శ్రీలత, కౌన్సిల‌ర్లు బంటారం లావణ్య, హిందు ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్, రాష్ట్రీయ హిందూ పరిషత్ పట్టణ అధ్య‌క్షులు తాండ్ర నరేష్, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.