సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
April 5, 2022
dharshininews
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) పథకం వరంగా మారిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి చెందిన కె.అంతప్పకు ప్రభుత్వం రూ. 32 వేల నిధులను మంజూరు చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి లబ్దిదారునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనందిస్తుందన్నారు. పేదలకు ఈ పథకం వరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దలు ఉన్నారు.