వర్షాల ఎఫెక్ట్..
July 13, 2022
dharshininews
వర్షాల ఎఫెక్ట్..
- అంబేద్కర్, ఓయూ పరిక్షలు వాయిదా
- త్వరలోనే వాయిదా పరీక్షల కొత్త షెడ్యూల్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యాసంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. మూడు రోజులు సెలవులు ప్రకటించగా వర్షాలు తగ్గకపోవడంతో విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వర్షాల ప్రభావం రేపటి నుంచి శనివారం వరకు జరిగే పలు పరీక్షలపై పడింది. గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలతో పాటు గురు, శుక్రవారాల్లో జరగాల్సిన పీజీ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

