ఆటోవాల జీవితాలతో చెలగాటం..!
September 6, 2026
dharshininews
ఆటోవాల జీవితాలతో చెలగాటం..!
- సమస్యలు పరిష్కరించని సర్కారుకు బుద్ది తప్పదు
- తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
- పట్టణ పుర వీధుల్లో ఆటోలతో ర్యాలీ
- ఆటో నడిపించి సమస్యలు తెలుసుకున్న పైలెట్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆటో వాలా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ సమరభేరీ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తాండూరు పట్టణంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రోహిత్ రెడ్డి పాల్గొని స్వయంగా ఆటో నడిపించారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడుతూ సమస్యలను తెలుసుకున్నారు. రోజంతా ఆటో నడిపినా కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని పలువురు డ్రైవర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం ఇందిరా చౌరస్తాలో రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఏటా 12 వేల ఆర్థిక సహాయం అందజేసతామని హామి ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని మండిపడ్డారు. రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోతే ఆ కుటుంబానికి దిక్కెవరు ఇన్సూరెన్స్ లేక, సహాయం లేక ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు.
వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం, వారి హక్కుల కోసం అవసరమైన పోరాటానికి అండగా ఉంటానని రోహిత్‌రెడ్డి తెలిపారు. ఆటో వాలాల రోజు వారి ఉపాది దెబ్బతింటున్నా పట్టించకోని సర్కారుకు రానున్న రోజుల్లో తగిన బుద్ది చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు సంతోష్ గౌడ్, రుద్రుపాటిల్, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44583/