తాండూరుకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు..!
September 5, 2026
dharshininews
తాండూరుకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు..!
- ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలత
- ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తాండూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కురువ శ్రీనివాస్, ప్రభుత్వ న్యాయవాది మహేందర్‌రెడ్డి తెలిపారు.
శనివారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్‌లోని సీఎం కార్యాలయంలో రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తాండూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుతో స్థానిక ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ అవుతాయని న్యాయవాదులు సీఎంకు వివరించారు.
వారి విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కోర్టు ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఉన్న ప్రాంతంలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉండాలనే నిబంధన ఉందని న్యాయవాదులు తెలిపారు.
ఈ నేపథ్యంలో తాండూరులో కోర్టు ఏర్పాటుకు మార్గం సుగమం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో న్యాయవాదులు చంద్రశేఖర్‌రెడ్డి, మస్తాన్ తదితరులు ఉన్నారు.
https://www.dharshininews.com/44562/