schedule Friday, November 06, 2026

ఎంపీ డా. మల్లు రవితో బీఎస్ఆర్ ఆత్మీయ భేటీ

calendar_today November 6, 2026
person dharshininews
ఎంపీ డా. మల్లు రవితో బీఎస్ఆర్ ఆత్మీయ భేటీ
ఎంపీ డా. మల్లు రవితో బీఎస్ఆర్ ఆత్మీయ భేటీ - రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవహారాలపై చర్చ తాండూరు, దర్శిని ప్రతినిధి: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డా. మల్లు రవితో తాండూరు ఆర్బీఓఎల్, కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బీఎస్ఆర్) ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, స్థానిక రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అలాగే తాండూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గ0కు సంబంధించిన విషయాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. https://www.dharshininews.com/45283/