schedule Thursday, November 05, 2026

క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..!

calendar_today November 5, 2026
person dharshininews
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..!
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి..! - ఆత్మవిశ్వాసం పెంపునకు క్రీడలు దోహదం - చదువుతో పాటు ఆటలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - అట్టహాసంగా ట్రస్మా టీసీఎల్-2026 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు అధిక సమయం కేటాయించకుండా క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్మా (తెలంగాణ రికాగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) తెలిపారు టీసీఎల్-2026 క్రికెట్ లీగ్‌ను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం, క్రీడలు కూడా అంతే ముఖ్యమని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యం అలవడుతుందన్నారు. ప్రతి విద్యార్థి తనలోని ప్రతిభను గుర్తించి చదువుతో పాటు క్రీడల్లోనూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రికెట్ లీగ్‌ను చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/45277/