పేదరికం కలలకు అడ్డుకాదు..!
September 6, 2026
dharshininews
పేదరికం కలలకు అడ్డుకాదు..!
- పనిచేస్తూ పంతుళ్లు కావడం ఆదర్శణీయం
- నలుగురు అన్నాదమ్ముల ఉపాధ్యాయులకు సన్మానం
- కోట్రిక విజయలక్ష్మీ నివాసంలో స్పూర్తిదాయక వేడుక
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదరికం.. కన్న కలలకు అడ్డుకాదని.. పనిచేస్తూ పంతుళ్లు అయిన అన్నాదమ్ముల కృషి ఆదర్శంగా నిలుస్తుందని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ అన్నారు.
వారి ఇంట్లో చిన్నతనం నుంచి చాకలి పని చేసిన సీ. శ్రీనివాస్, సీ. రమేష్, సీ. రాజేష్ కుమార్, సీహెచ్. నరేందర్ చదువుపై పట్టుదలతో ముందుకు సాగి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించి తమ జీవితాలను మార్చుకున్నారు. ప్రస్తుతం సీ. శ్రీనివాస్ పెద్దేముల్ మండలం మంబాపూర్‌లో, సీ. రమేష్ యాలాల మండలంలో, సీ. రాజేష్ కుమార్ యాలాల మండలం హాజీపూర్‌లో, సీహెచ్. నరేందర్ బొంరాస్‌పేట్ మండలం సూర్యాయక్ తండాలో ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు.
అయితే శనివారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ తన నివాసంలో సీ. శ్రీనివాస్, సీ. రమేష్, సీ. రాజేష్ కుమార్, సీహెచ్. నరేందర్‌లను ఘనంగా సన్మానించారు. పేదరికం తమ కలలకు అడ్డుకాదని నిరూపిస్తూ నలుగురూ టీచర్లుగా ఎదిగి పలువురికి స్ఫూర్తిగా నిలిచారని వారి కృషిని కొనియాడారు.
చిన్నతనంలో తన ఇంట్లో పనిచేసిన వారు నేడు ఉపాధ్యాయులుగా ఎదగడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. నలుగురు సొంత అన్నదమ్ములు కష్టపడి చదువుకుని ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. కష్టాలను చూసి వెనుకడుగు వేయకుండా చదువుతో జీవితాన్ని మార్చుకున్న ఈ అన్నదమ్ముల ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
https://www.dharshininews.com/44581/