schedule Saturday, July 04, 2026

కూలీ కుంటుంబానికి చేయూత‌

calendar_today July 17, 2022
person dharshininews
కూలీ కుంటుంబానికి చేయూత‌
కూలీ కుంటుంబానికి చేయూత‌ - జేయూహెచ్ ద్వారా నిత్య‌వ‌స‌ర‌ సరుకుల పంపిణీ తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : వర్షానికి ఇళ్లు కూలి పోయి రోడ్డున పడ్డ కూలీ కుటుంబానికి జమియత్ ఉలేమా హింద్ చేయూతనందించింది. తాండూరు మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కూలీ నందిగామ‌ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇళ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న జమియత్ ఉలేమా హిందూ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మౌలానా అజర్ ఖాస్మి తాండూరు మండల టీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ తో కలిసి ఆదివారం అనిల్ కుటుంబాన్ని పరామర్శించారు. కూలీ పనులు చేసుకునే అతని కుటుంబానికి నిత్యవసర సరుకులను అందజేసి చేయూతను అందించారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ సదర్ మౌలానా, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సతీష్ పాటిల్, శ్యాణప్ప, జగదీస్, జగన్, యువకులు తదితరులు ఉన్నారు.