schedule Sunday, September 06, 2026

వ‌ర్షాల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

calendar_today July 23, 2022
person dharshininews
వ‌ర్షాల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి
వ‌ర్షాల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి - ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు చ‌ర్య‌లు - స‌మీక్ష స‌మావేశంలో సీఎం కేసీఆర్ - కీల‌క శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: వాతావరణ శాఖ హెచ్చ‌రిక‌ల‌తో భారీ వర్షాలు వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో సీఎఎం కేసీఆర్ ప‌లు శాఖ‌ల అధికారుల‌తో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో.. మొన్నటి కంటే వరదలు సంభవించే ప్రమాదం ఉంది. కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు’అని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్.ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని వర్షాలు, వరదలు, చెరువుల పరిస్థితిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ హెచ్చరికలను ఆధారం చేసుకొని, కురవబోయే భారీ వర్షాల వల్ల సంభవించే వరదను ముందుగానే అంచనా వేస్తే.. లోతట్టు ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యల కోసం ఈ టెక్నాలజీని వినియోగించుకోవచ్చని రజత్ కుమార్ వివరించారు.