శ్రీ క్రిష్ణవేణి టాలెంట్‌లో ఘనంగా క్రిష్ణాష్టమి వేడుకలు
September 4, 2026
dharshininews
శ్రీ క్రిష్ణవేణి టాలెంట్‌లో ఘనంగా క్రిష్ణాష్టమి వేడుకలు
- క్రిష్ణుడు, గోపికల వేషాధారణలో చిన్నారుల సందడి
- ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్(ఎస్‌కేటీఎస్)లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
క్రిష్ణాష్టమి సందర్బంగా పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. పాఠశాలలో శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలతో వేడుకలు ప్రారంభించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో మురిపించి.. మైమరిపించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ పట్లోళ్ల సర్వోత్తం రెడ్డిలు మాట్లాడుతూ.. భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అందించిన సందేశాలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. సంప్రదాయ పండుగలను విద్యార్థులతో కలిసి నిర్వహించడం ద్వారా వారికి మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందన్నారు.
ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని తెలిపారు. డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డి విద్యార్థుల ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్. రమేష్, సీనియర్ ఉపాధ్యాయులు పి. చంద్రశేఖర్ రెడ్డి, ఎ. అనిల్ కుమార్, సునీత తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44543/