schedule Friday, September 04, 2026

పవిత్ర దేవాలయాలపై అసత్య ప్రచారం తగదు

calendar_today September 4, 2026
person dharshininews
పవిత్ర దేవాలయాలపై అసత్య ప్రచారం తగదు
పవిత్ర దేవాలయాలపై అసత్య ప్రచారం తగదు - కూల్చివేతలంటూ ఆరోపణలు మానుకోవాలి - ఎమ్మెల్యే గురించి తెలుసుకుని మాట్లాడాలి - పోట్లీ మహరాజ్ దేవాలయ కార్యవర్గ సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని దేవాలయాలపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేరును ప్రస్తావిస్తూ అసత్య ప్రచారాలను చేయడం తగదని పోట్లీ మారాజ్‌ దేవాలయ కార్యవర్గ సభ్యుడు ఎస్‌. ప్రసాద్‌ గౌడ్‌, సభ్యులు అన్నారు. పోట్లీ మారాజ్‌ దేవాలయానికి సంబంధించి రాజుగౌడ్‌తో పాటు కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. దేవాలయం అత్యంత పవిత్రమైన స్థలమని, ఆలయానికి సంబంధించిన అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకుని బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయాన్ని కూల్చివేయడం, స్థలాలను కబ్జా చేయడం వంటి ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే వాటిని ప్రజల ముందుంచాలని, ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయవద్దని సూచించారు. ఆలయ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించి భక్తుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సూచనలతో దేవాలయాలలో సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దేవాలయ పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భక్తుల్లో గందరగోళం కలిగించేలా అసత్య ప్రచారం చేయకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేపై దుష్ప్రచారాలను మానుకోవాలని సూచించారు. https://www.dharshininews.com/44541/