schedule Saturday, September 12, 2026

కరణ్ కోట్ పోలీస్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

calendar_today July 29, 2022
person dharshininews
కరణ్ కోట్ పోలీస్ కానిస్టేబుళ్లకు పదోన్నతి
కరణ్ కోట్ పోలీస్ కానిస్టేబుళ్లకు పదోన్నతి - అభినందించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు రూరల్ సర్కిల్ లోని కరణ్ కోట్ పోలీస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు పదోన్నతి వ‌రించింది. క‌ర‌ణ్ కోట్‌ పోలీస్టేషన్ నుంచి కోర్టు విధులు చేపడుతున్న కానిస్టేబుల్ లోక్యనాయక్ తో పాటు అదే పోలీస్టేషన్ నుంచి వికారాబాద్ ఎస్పీ ఆఫీస్ స్పెషల్ బ్రాంచ్ కు అటాచ్‌గా విధులు నిర్వహిస్తున్న కమలాక‌ర్‌ల‌కు జ‌మిందార్లుగా పదోన్నతి దక్కింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వారికి పదోన్నతి పత్రాలను అందజేసి అభినందించారు. ప‌దోన్న‌తితో మ‌రింత ఉత్స‌హాంగా విధులు నిర్వ‌ర్తించి మంచి పేరు సాధించాల‌ని ఎస్పీ కోటిరెడ్డి ఆకాంక్షించారు.