schedule Saturday, July 04, 2026

ఓట‌రు న‌మోదుకు వేళాయే..!

calendar_today July 31, 2022
person dharshininews
ఓట‌రు న‌మోదుకు వేళాయే..!
ఓట‌రు న‌మోదుకు వేళాయే..! - రేప‌టి నుంచి కొత్త ఓట‌ర్ల న‌మోదు  - న‌మోదుతో పాటు మార్పులకు అవకాశం హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు నమోదుకు వేళ అయ్యింది. రేప‌టి నుంచి నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవ‌కాశం క‌ల్పించింది. ఆగ‌స్టు 1 నుంచి కొనసాగే ఈ కార్య‌క్ర‌మం 31 వరకు అమల్లో ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే జిల్లాల అధికారులు స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు, వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. భారత ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ఫారం 6,7,8, గరుడ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. న‌మోదు చేసుకునే విధానం నూతన ఓటర్లు నమోదు కోసం ఫారం-6 వినియోగించాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు మార్పు కోసం  ఫారం- 7 పూరించాల్సి ఉంటుంది. ఫారం-8లో పేరు, స్త్రీ, పురుష భేదాలు, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ, చరవాణి నంబర్ వంటి మార్పులు చేసుకోవచ్చు. ఓటర్లుగా నమోదైన వారు ఆధార్ నంబర్ జత చేయడానికి నూత నంగా ఫారం-6బి ని ప్రవేశ పెట్టాలి. ఓటరు తన ధ్రువీకరణ కోసం ఆధార్ నంబరును ఫారం 6బి ద్వారా తెల‌పాలి. ఓటరు నమోదుకు గతంలో జనవరి వెళ్లిన వారు, మృతి చెందిన వారి పేరు తొలగింపు కోసం 1న ప్రామాణికంగా తీసుకునే వారని ఇక నుంచి ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్1, తేదీలను కూడా ప్రామాణికంగా తీసు కుంటారని వివరించారు. ఎలాంటి సందేహాలున్నా ఆర్డీఓ, తహసీల్దార్లులను కలిసి నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.