schedule Sunday, September 13, 2026

వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్..!

calendar_today August 4, 2022
person dharshininews
వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్..!
వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్..! - నేడు తాండూరులో వాహనాల వేలం - ప్రకటించిన ఎక్సైజ్ సీఐ చంద్రకాంత్ రెడ్డి తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వాహ‌న‌దారుల‌కు తాండూరు ఎక్సైజ్ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఆ శాఖ‌ ద్వారా నిర్వ‌హించిన వివిధ త‌నీఖీల‌లో పట్టుబడిన వాహనాలకు నేడు వేలం నిర్వహిస్తున్నట్లు తాండూరు ఎక్సైజ్ సీఐ చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నేడు శుక్రవారం సాయిపూర్‌లోని ఎక్సైజ్ కార్యాల‌యంలో మధ్యాహ్నం 2 గంటలకు వేలం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మొత్తం 8 వాహనాలకు వేలం జరుగుతుందని, ఇందులో బజాజ్ ఆటో, ఒక స్ల్పెండర్ ప్లస్ బైకు, హీరో హోండా స్ల్పెండర్ బైకు, హీరో హోండా ఫాషన్ ప్ల‌స్ బైకు, మరొక ఆటో, టీవీఎస్ ఎక్స్ ఎల్ సూపర్, హొండా డ్రీమ్ యుగా, గ్లాంబర్ బైకులు ఉన్నాయని తెలిపారు. ఈ వేలంలో వికారాబాద్, తాండూరుతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.