schedule Saturday, September 12, 2026

సమ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..!

calendar_today September 12, 2026
person dharshininews
సమ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..!
సమ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం..! - తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి - గురువుల సేవలకు ఘన సత్కారం తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్స్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తరగతి గదిలో విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు వేసే బాటలోనే విద్యార్థుల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. సమాజ పురోగతిలో గురువుల పాత్రకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని అభినందించిన మనోహర్‌రెడ్డి.. వారి సేవలకు గుర్తింపుగా సన్మానించడం గర్వంగా ఉందన్నారు. నూతనంగా ఏర్పడిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు కూడా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి కోసం సంఘాలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, ఎంఈవో ఇందుప్రియ, నాయకులు, ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44654/