గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
September 11, 2026
dharshininews
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
- ప్రతిష్టాపన, నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
- అన్ని శాఖల అధికారులు సమన్వయం ముందుకు సాగాలి
- శాంతి సమావేశంలో తాండూరు ఆర్డీఓ కర్ర అనిత ఆదేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు ఆర్డీఓ కర్ర అనిత అధికారులను ఆదేశించారు.
ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు.
గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, తాగునీరు, భక్తులకు అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. ప్రధాన కూడళ్లు, గణేష్ మండపాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అనిత సూచించారు. నిమజ్జనం సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
విద్యుత్ వైర్లు, రహదారులు, పారిశుధ్యం, తాగునీరు తదితర అంశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు ముందుగానే చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, సీఐలు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44648/