schedule Friday, September 11, 2026

బల్దియాలో డిజీల్ అవినీతి..!

calendar_today September 11, 2026
person dharshininews
బల్దియాలో డిజీల్ అవినీతి..!
బల్దియాలో డిజీల్ అవినీతి..! - ప్రజాధనం దుర్వినియోగం - లెక్కల వివరాల్లో జాప్యం ఎందుకో - దోపిడిని తేల్చేందుకు ఆర్టీఐ దరాఖాస్తు - బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో డిజీల్ వినియోగంలో భారీ అవినీతి జరుగుతోందని 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్‌ ఆరోపించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ అధికారులకు ఆర్టీఐ దరఖాస్తును అందించారు. ఈ సందర్బంగా జావిద్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్‌లో డిజీల్ దుబారాపై అనుమానాలు రావడంతో కమీషనర్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తుచేశారు. గత కౌన్సిల్‌లో డిజీల్ వివరాలు అందజేస్తామని చెప్పి.. ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను అందజేయలేదని తెలిపారు. మున్సిపల్‌లో జరుగుతున్న డిజీల్ దుర్వినియోగంపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మున్సిపల్‌ నుంచే వివరాలు రాబట్టేందుకు ఆర్టీఐ దరఖాస్తును అందజేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. మున్సిపల్‌లో ప్రజాధనం దుర్వినియోగం జరగకుండా బీఆర్ఎస్ పార్టీ తరుపున పోరాడడం జరుగుతుందన్నారు. డిజీల్‌లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు దేనికైనా సిద్దంగా ఉంటామని అన్నారు. అదేవిధంగా తాండూరులో మైనర్లు వాహనాలను నడిపించకుండా పోలీసు, సంబంధిత అధికారులు దృష్టిసారించాలని కోరారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. https://www.dharshininews.com/44642/