schedule Saturday, September 12, 2026

భళా.. శ్రీకృష్ణవేణి టాలెంట్‌ విద్యార్థులు..!

calendar_today September 12, 2026
person dharshininews
భళా.. శ్రీకృష్ణవేణి టాలెంట్‌ విద్యార్థులు..!
భళా.. శ్రీకృష్ణవేణి టాలెంట్‌ విద్యార్థులు..! - మట్టి వినాయకుల తయారితో స్పూర్తి - ఉత్సహాంగా పాల్గొన్న స్టూడెంట్స్ - అభినందించిన యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు బాటలు వేయాలనే సందేశాన్ని శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులు చాటారు. శనివారం తాండూరులోని పాఠశాలలో విద్యార్థులతో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని స్వయంగా మట్టి గణపతులను తయారు చేశారు. అంత తాండూరుకు చెందిన మట్టి విగ్రహాల కళాకారుడిని ప్రత్యేకంగా పాఠశాలకు ఆహ్వానించి, మట్టిని ఉపయోగించి గణపతి విగ్రహాన్ని రూపొందించే విధానాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. కళాకారుడి సూచనలతో విద్యార్థులు ఆసక్తిగా మట్టి విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల వల్ల నీటి వనరులకు కలిగే కాలుష్యాన్ని, మట్టి విగ్రహాలతో పర్యావరణానికి జరిగే మేలుపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన మట్టి గణపతులతో పాఠశాలలో వినాయక ఆగమన వేడుకలు నిర్వహించారు. మంగళహారతులు, భక్తిగీతాలు, నృత్యాలతో చిన్నారులు సందడి చేయడంతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. పాఠశాల చైర్మన్‌ ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గణపతి పూజ విశిష్టతను వివరించారు. విద్యార్థుల్లోని భక్తి, సృజనాత్మకతను అభినందించారు. కరస్పాండెంట్‌ పట్లొల్ల సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ పండుగలతో పాటు ప్రకృతి పరిరక్షణను కూడా మన బాధ్యతగా భావించాలని సూచించారు. డైరెక్టర్‌ ద్యావరి జయవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ, సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎన్‌. రమేష్‌, సీనియర్‌ ఉపాధ్యాయులు పి. చంద్రశేఖర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, సునీత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44663/