schedule Friday, July 10, 2026

శ్రీ స్పటిక లింగేశ్వ‌ర స్వామిగా శివుడు

calendar_today August 8, 2022
person dharshininews
శ్రీ స్పటిక లింగేశ్వ‌ర స్వామిగా శివుడు
శ్రీ స్పటిక లింగేశ్వ‌ర స్వామిగా శివుడు - భ‌ద్రేశ్వారాల‌యంలో ప్ర‌త్యేక అంక‌ర‌ణ‌ - ద‌ర్శించుకున్న భ‌క్తులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణంలోని భావిగి భ్ర‌దేశ్వ‌రాల‌యంలో శివుడు శ్రీ స్ప‌టిక లింగేశ్వ‌ర‌స్వామిగా ద‌ర్శ‌న‌మించ్చారు. శ్రావ‌ణ మాసం రెండో సోమ‌వారం సంద‌ర్భంగా ఆల‌య పూజారి విజ‌య్ కుమార్ స్వామి ఆల‌యంలో వెల‌సిన శివున్ని ఘ‌ట్కేస‌ర్ పోచారంలో వెల‌సిన శ్రీ స్పటిక లింగేశ్వ‌ర‌స్వామిగా అలంక‌ర‌ణ చేశారు. ఈ విష‌యం తెలుసుకున్న భ‌క్తులు ఆల‌యానికి పెద్ద ఎత్తున చేరుకుని రాచ‌న్న స్వామిగా ద‌ర్శ‌న‌మిచ్చిన శివునికి పూజ‌లు నిర్వ‌హించారు. స‌ల్లంగా చూడు స్వామి అంటూ శివున్ని వేడుకున్నారు.