schedule Sunday, September 13, 2026

తాండూరు హిందూ ఉత్సవ కమిటీ ఎన్నిక

calendar_today August 14, 2022
person dharshininews
తాండూరు హిందూ ఉత్సవ కమిటీ ఎన్నిక
తాండూరు హిందూ ఉత్సవ కమిటీ ఎన్నిక - గౌరవాధ్యక్షులుగా రాజుగౌడ్, అధ్యక్షురాలుగా స్వప్న పరిమళ్ - సమితి ప్రధాన కార్యదర్శిగా రెండోసారి పట్లోళ్ల నర్సింలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పాటయ్యింది. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సవి ప్రతి నూతన కార్యవర్గం ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సమితి గౌరవాధ్యక్షులుగా టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, అధ్యక్షురాలుగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శిగా మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలులను ఎన్నుకున్నారు. మిగతా కార్యవర్గానికి ఎన్నిక జ‌ర‌గ‌లేదు. త్వ‌ర‌లోనే పూర్తి కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకుంటామ‌ని స‌మితి స‌భ్యులు పేర్కొన్నారు. హిందూ ఉత్స‌వ‌ సమితి ప్రధాన కార్యదర్శిగా పట్లోళ్ల నర్సింలు రెండో సారి ఎన్నిక కావడం విశేషం.