schedule Saturday, July 04, 2026

వాగులో మ‌హిళ మృత‌దేహం

calendar_today August 15, 2022
person dharshininews
వాగులో మ‌హిళ మృత‌దేహం
వాగులో మ‌హిళ మృత‌దేహం - యాలాల బెన్నూర్ కాగ్నా వాగులో ల‌భ్యం తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: గుర్తుతెలియ‌ని మ‌హిళ మృత‌దేహం వాగులో ల‌భ్య‌మైంది. ఈ సంఘ‌ట‌న తాండూరు నియోజ‌క‌వ‌ర్గం యాలాల మండ‌లంలోని బెన్నూరు గ్రామ శివారు కాగ్నా వాగు స‌మీపంలో చోటు చేసుకుంది. యాలాల ఎస్ఐ అర‌వింద్ తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల ప్రాంతంలో సుమారు 50 నుంచి 55 ఏండ్ల వ‌య‌స్సు ఉన్న గుర్తుతెలియ‌ని మ‌హిళ మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి ప‌రిశీలించారు. రోజుల క్రిత‌మే మ‌హిళ మ‌ర‌ణించ‌డంతో మృత‌దేహం ఉబ్బిపోయి గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది. దీంతో మృతురాలి వివ‌రాలు తెలియ‌రాలేదు. మృతురాలి ఒంటిపై ఆకుప‌చ్చ చీర‌, ఆకుప‌చ్చ గాజుల‌తో పాటు మెడ‌లో తాళం చెవి తాడు ఉంది. మృతురాలి ఆచూకీ తెలిస్తే యాలాల పోలీసుల‌ను సంప్ర‌దించాల‌ని ఎస్ఐ అర‌వింద్ సూచించారు.