అలరించిన ఆబాల గోపాలం
August 19, 2022
dharshininews
అలరించిన ఆబాల గోపాలం
- కరణ్ కోట్ డీఏసీ స్కూళ్‌లో క్రిష్ణాష్టమి వేడుకలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కరణ్‌కోట్‌లోని డీఏవీ స్కూళ్లో ఆబాల గోపాలం అలరించింది. శుక్రవారం పాఠశాలలో శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రిష్ణాష్టమిని పురస్కరించుకుని పాఠశాలకు చెందిన చిన్నారులు శ్రీ క్రిష్ణ, గోపికా వేషాధారణలతో వచ్చారు. క్రిష్ణాష్టమి వేడుకలలో మైమరిపించే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఏవీ స్కూల్ సౌత్ జోనల్ ఆఫీసర్ వీఎన్ఎన్‌కే శేషాద్రి చిన్నారి శ్రీ క్రిష్ణ, గోపికలతో సందడి చేశారు. ప్రదర్శనలతో ఆకట్టుకున్న చిన్నారులను అభినందించారు. చిన్నారి శ్రీక్రిష్ణ, గోపికలు ఆట పాటలతో ఆబాల గోపాలాన్ని తలపించారు. ఉత్సహాంగా క్రిష్ణాష్టమి వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏసురత్నం, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.