schedule Monday, September 14, 2026

ఇంటింటా క్రిష్ణాష్ట‌మి..!

calendar_today August 19, 2022
person dharshininews
ఇంటింటా క్రిష్ణాష్ట‌మి..!
ఇంటింటా క్రిష్ణాష్ట‌మి..! - సందడి చేసిన చిన్నికృష్ణులు, గోపికలు - శ్రీకృష్ణ పరమాత్మునికి పూజలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్ర‌వారం ఇంటింటా చిన్ని కృష్ణులు.. చిలిపి కృష్ణులు.. గోపికలు సందడి చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా తెలుగు ఇండ్లలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుని పూజలతో ఇండ్లు దైవాలయాలుగా మారాయి. అనంతరం ఇంటిలోని చిన్నారులను నల్లన్నయ్యలుగా.. యశోధ.. గోపికలుగా వేషాధార‌ణ చేసుకున్నారు. శ్రీకృష్ణులు, గోపికల ఆట పాటలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. చిన్ని శ్రీకృష్ణుని, రాధలతో కోలాటలాడుతూ ఉత్సహాంగా గడిపారు.