schedule Friday, July 10, 2026

భూకైలాస్‌లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పూజలు

calendar_today August 24, 2022
person dharshininews
భూకైలాస్‌లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పూజలు
భూకైలాస్‌లో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పూజలు - కుటుంబ సమేతంగా జ్యోతిర్లింగాల దర్శనం - ఎస్పీని సన్మానించిన వాసు పవార్ నాయక్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సందర్శించారు. బుధవారం కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల సమక్షంలో ఎస్పీ కోటిరెడ్డి సతీమణి, కుమారులతో కలిసి శివునికి పూజలు నిర్వహించారు. వేదమంత్రాలతో పండితులు ఎస్పీ చేత పూజలు చేయించారు. అనంతరం ఆశీర్వదించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందే ఆలయ వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పూజల అనంతరం ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని వాసు పవార్ నాయక్ ఘనంగా సన్మానించారు.