schedule Wednesday, September 16, 2026

గణనాథునికి ఘనమైన పూజలు

calendar_today September 3, 2022
person dharshininews
గణనాథునికి ఘనమైన పూజలు
గణనాథునికి ఘనమైన పూజలు - వాడ వాడ‌ల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికం - వినాయ‌కుల‌ను దర్శించుకుంటున్న అధికారులు, నేతలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వినాయక చవితి సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు నాలుగో రోజు ఘనమైన పూజలు అందుకున్నాడు. వినాయక మండపాల్లో కొలువుదీరిన గణపయ్యలను భ‌క్తులతో పాటు రాజకీయ నేతలు దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుండ‌డంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటోంది. ప‌ట్ట‌ణంలోని వినాయ‌క చౌర‌స్తాలో ప్ర‌తిష్టించిన భారీ వినాయుకునికి స్థానిక వ్యాపారులు ప‌ద్మ‌నాభం, దుర్గా మెడిక‌ల్ షాపు య‌జ‌మాని న‌గేష్ కుటుంబ స‌భ్యులు పూజ‌లు నిర్వ‌హించారు. మ‌రోవైపు ప‌ట్ట‌ణంలో వివిధ వార్డుల‌లో వెల‌సిన వినాయ‌కుల‌కు నేత‌లు, భ‌క్తులు పూజ‌లు నిర్వ‌హించి నైవేద్యాలు స‌మ‌ర్పించారు. శుక్ర‌వారం నాలుగో రోజు కావ‌డంతో వివిధ మండ‌ల‌పాల వ‌ద్ద అన్న దాన కార్య‌క్ర‌మాలు చేపడుతున్నారు.