schedule Tuesday, September 15, 2026

రేపు మాజీ మంత్రి మాణిక్ రావు వ‌ర్దంతి

calendar_today September 7, 2022
person dharshininews
రేపు మాజీ మంత్రి మాణిక్ రావు వ‌ర్దంతి
రేపు మాజీ మంత్రి మాణిక్ రావు వ‌ర్దంతి - టీపీసీసీ ఉపాధ్య‌క్షులు ఎం.ర‌మేష్ మ‌హ‌రాజ్ తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: స్వర్గీయ మాజీ మంత్రి ఎం.మణిక్ రావు మహరాజ్ 6వ వర్దంతిని రేపు నిర్వ‌హిస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్య‌క్షులు ఎం.ర‌మేష్ మ‌హ‌రాజ్ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గురువారం ఉద‌యం మాణిక్ రావు వ‌ర్దంతిని పురస్కరించుకుని మహారాజుల కుటుంబం ఆధ్వర్యంలో సీసీఐ రోడ్డు, డీసీఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మణిక్ రావు గారి విగ్రహానికి పూల మాలలతో నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప‌ట్ట‌ణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో కూడా మాణిక్ రావు మహరాజ్ గారి చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులర్పించడం జరుగుతుందని తెలిపారు. కావున మాణిక్ రావు మహరాజ్ గారి అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, బంధువులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అందరు హాజ‌రుకావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.