schedule Monday, September 14, 2026

మాణిక్ రావు ఆశయ సాధనకు కృషి చేయాలి

calendar_today September 8, 2022
person dharshininews
మాణిక్ రావు ఆశయ సాధనకు కృషి చేయాలి
మాణిక్ రావు ఆశయ సాధనకు కృషి చేయాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ - వర్దంతిలో మాణిక్ రావుకు నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్ రావు ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం బీసీ సంఘం ఆధ్వర్యంలో మాణిక్ రావు 6వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్ రావు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మండల యువజన అధ్యక్షులు బసంత్ కుమార్, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణచారి, సభ్యులు బాలు యాదవ్, రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, బస్వరాజు, శ్రీను, హరిప్రసాద్. బాస్కల్, చంద్రశేఖర్, గుండు. రాజు, దాస్ తదితరులు పాల్గొన్నారు.