ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలి
September 10, 2022
dharshininews
ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలి
- మున్సిపల్ కౌన్సిలర్ మహరాజ్ భేగం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరు ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింకు చేయించుకోవాలిన తాండూరు మున్సిపల్ 30వ వార్డు కౌన్సిలర్ మహరాజ్ భేగం పేర్కొన్నారు. శనివారం తన వార్డులో మహరాజ్ బేగం ఓటరు కార్డు అనుసంధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వాలు ఓటు హక్కు వినియోగంలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఆధార్ అనుసంధానం చేయిస్తుందన్నారు. దీంతో బోగస్ ఓట్లు తొలగించబడతాయన్నారు. కావున ప్రజలు తమ ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించుకోవాలన్నారు. ప్రజలు వార్డులోని అంగన్వాడి కేంద్రంలో ఆధార్ కార్డులను అందించాలని సూచించారు.