సాయిపూర్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ
September 15, 2026
dharshininews
సాయిపూర్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ
- శంకర్ యాదవ్, బంటు మల్లప్ప ఆధ్వర్యంలో సేవ
- తాత గుడి సన్నిధిలో భక్తుల సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని సాయిపూర్‌లో గణేష్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయిపూర్‌లోని తాతాగుడి వద్ద శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
శంకర్ యాదవ్, బంటు మల్లప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ముందుగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో తాతాగుడి పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా శంకర్ యాదవ్, బంటు మల్లప్ప మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందన్నారు.
గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకర్ యాదవ్ మిత్ర బృందం, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.
https://www.dharshininews.com/44715/