schedule Monday, September 14, 2026

గణనాథుని సేవలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి

calendar_today September 14, 2026
person dharshininews
గణనాథుని సేవలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
గణనాథుని సేవలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డి - తాండూరులో మండపాల వద్ద ప్రత్యేక పూజలు - వినాయకుని కృపా కటాక్షాలు సిద్దించాలని ఆకాంక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి: పవిత్ర వినాయక చవితి ఉత్సవాలు తాండూరు పట్టణంలో భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. గణనాథుని సేవలో తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి తరలించారు. సోమవారం భద్రేశ్వర చౌక్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతి ఇచ్చారు. అనంతరం పట్టణంలోని గాంధీనగర్‌, నాగారం కాంపౌండ్‌, శాంతినగర్‌ తదితర కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మహేందర్‌రెడ్డి సందర్శించారు. ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతి ఇచ్చారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ నేతలు కరణం పురుషోత్తంరావు, రాజుగౌడ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ విశ్వనాథ్‌గౌడ్‌, అగ్గనూరు జగదీశ్వర్‌, తంబాకు చంద్రశేఖర్‌, అరవింద్‌రెడ్డి, కార్యదర్శి బిర్కిట్‌ రఘు, భగవాన్‌, మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు హరిగౌడ్‌, శ్రీనివాస్‌, ముక్తార్‌, కౌన్సిలర్‌ యోగానంద్‌, రుద్రు తదితరులు పాల్గొన్నారు. https://www.dharshininews.com/44700/