పండుగ వేళ.. ప్రాణదాతలు..!
September 14, 2026
dharshininews
పండుగ వేళ.. ప్రాణదాతలు..!
- రక్తదానం చేసిన కౌన్సిలర్ జావిద్
- తన వార్డు యువతతో కలిసి సామాజిక సేవ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు జిల్లా ఆసుపత్రిలో రక్త నిల్వలు నిండుకున్నాయని తెలుసుకొని రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి పట్టణంలోని 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ తో పాటు అతని వార్డుకు చెందిన యువత ప్రాణదాతలుగా మారారు.
మిలాద్-ఉన్-నబీ, వినాయక చవితి పండుగలను పురస్కరించుకుని సోమవారం స్థానిక యువత, వార్డు ప్రజల భాగస్వామ్యంతో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.తాండూరు జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్ జావిద్ స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు.
ప్రస్తుతం రక్తనిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యవసర సమయాల్లో అవసరమైన వారికి రక్తం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేందుకు రక్తదానం ఎంతో గొప్ప సేవ అని జావిద్ పేర్కొన్నారు.
పండుగలను ఆనందంగా జరుపుకోవడంతో పాటు.. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములు కావాలని తాండూరు ప్రజలు, యువతకు పిలుపునిచ్చారు. వెంట వచ్చి రక్తదానం చేసిన యువతకు అభినందనలు తెలిపారు.
https://www.dharshininews.com/44683/