చవితి శుభారంభం..!
September 14, 2026
dharshininews
చవితి శుభారంభం..!
- హిందూ ఉత్సవ సమితి తొలి పూజ
- మొట్ట మొదటిసారి ముందు పూజలు
- సమితి శ్రీకారానికి శుభాసీస్సులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక పూజకు ఘనంగా శ్రీకారం చుట్టారు.
సమితి ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించి, గణనాథుడి ఆశీస్సులతో సమితి కార్యక్రమాలకు శుభారంభం పలికారు. తాండూరులోని హిందూ ఉత్సవ సమితి కార్యాలయంలో సోమవారం చవితి ఉత్సవాలలో భాగంగా మొట్ట మొదటి సారి ముందు పూజల గణపయ్యకు పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షురాలు, మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, నేతలు రాజుగౌడ్, పట్లోళ్ల బాల్ రెడ్డి తదితరులు హాజయ్యారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించిన అనంతరం సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. తొలిసారి నిర్వహించిన పూజా కార్యక్రమం సందర్భంగా సమితి సభ్యుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా పలువరు మాట్లాడుతూ తాండూరులో హిందూ పండుగలు, ఉత్సవాలను ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు హిందూ ఉత్సవ కేంద్ర సమితి ముందుకు సాగుతుందని సభ్యులు తెలిపారు. సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ ప్రజలను భాగస్వామ్యం చేసుకునేలా కార్యక్రమాలు నిర్వహించడమే సమితి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, కోశాధికారి అంతారం కిరణ్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.