schedule Sunday, July 05, 2026

కేసీఆర్‌ను మ‌రువొద్దు..!

calendar_today September 12, 2022
person dharshininews
కేసీఆర్‌ను మ‌రువొద్దు..!
కేసీఆర్‌ను మ‌రువొద్దు..! - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ - ఆస‌రా లబ్దిదారులకు గుర్తింపు కార్డుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద‌ల సంక్షేమానికి కృషి చేస్తోన్న‌సీఎం కేసీఆర్ లబ్దిదారులు మ‌రువ‌ద్ద‌ని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని తన వార్డు 27కు చెందిన ఆసరా మంజూరైన లబ్దిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ 57 ఏండ్లు నిండిన వారికి కూడ ఆసరా అందిస్తున్నారని అన్నారు. పేదలకు అండగా నిలుస్తూ సీఎం కేసీఆర్ పెద్ద కొడుకుగా మారారని అన్నారు. అర్హులైన ఆసరా లబ్దిదారులను ఆదరిస్తున్న సీఎం కేసీఆర్ మ‌ర‌వ‌కుండా రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఆర్పీ తదితరులు పాల్గొన్నారు.