schedule Thursday, September 17, 2026

అట్ట‌హాసంగా మ‌హేంద్రుడి జ‌న్మ‌దినం

calendar_today September 23, 2022
person dharshininews
అట్ట‌హాసంగా మ‌హేంద్రుడి జ‌న్మ‌దినం
అట్ట‌హాసంగా మ‌హేంద్రుడి జ‌న్మ‌దినం - శుభాకాంక్ష‌లు తెలిపిన తాండూరు నేత‌లు - గ‌జ‌మాల‌తో స‌త్క‌రించిన అభిమానులు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మాజీ ర‌వాణాశాఖ మంత్రి, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. శుక్ర‌వారం మ‌హేంద‌ర్ రెడ్డి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తాండూరు నుంచి నేత‌లు భారీగా హైద‌రాబాద్ త‌ర‌లివెళ్లారు. హైద‌రాబాద్‌లో మంత్రి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. మున్సిప‌ల్ మాజీ చైర్ ప‌ర్స‌న్ కోట్రిక విజ‌య‌ల‌క్ష్మీ, టీఆర్ఎస్ యువ‌నాయ‌కులు బిర్క‌డ్ ర‌ఘు, వేణుగోపాల్ రెడ్డి, ద‌త్తు త‌దిత‌రులు మ‌హేంద‌ర్ రెడ్డిని స‌న్మానించి శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌హేంద‌ర్ రెడ్డి చేత కేక్ క‌ట్ చేయించి తినిపించారు. అనంత‌రం భారీ గ‌జ‌మాల‌తో స‌న్మానించారు. మ‌హేంద‌ర్ రెడ్డి నాయ‌క‌త్వం వ‌ర్దిల్లాల‌ని నినాదాలు చేశారు.