schedule Sunday, July 05, 2026

ఐలమ్మ వీర‌త్వ‌మే అంద‌రికి స్ఫూర్తిని

calendar_today September 26, 2022
person dharshininews
ఐలమ్మ వీర‌త్వ‌మే అంద‌రికి స్ఫూర్తిని
ఐలమ్మ వీర‌త్వ‌మే అంద‌రికి స్ఫూర్తిని - మ‌హ‌నీయురాలును ఆదర్శంగా తీసుకోవాలి - మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ వీర‌త్వం అంద‌రికి స్పూర్తిదాయ‌క‌మ‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు అన్నారు. సోమ‌వారం చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఐల‌మ్మ చిత్ర‌ప‌టానికి, వి.వి.ఎచ్.ఎస్ పాఠశాల స‌మీపంలోని ఐలమ్మ విగ్రహాన్నికి దీపా న‌ర్సింలు పూలమాలలు వేసి ఘనంగా నివ్వాలర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కొసం, భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం రజకారులను, భూస్వాములును ఎదురించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తొలి భూ పోరాటానికి సామాజిక న్యాయానికి నాంది పలికిన ధైర్య శైలి, వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఐలమ్మ వీరత్వాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్ర‌మంలో కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు ప్ర‌భాక‌ర్ గౌడ్, పార్టీ ఫ్లోర్ లీడ‌ర్ వ‌రాల శ్రీ‌నివాస్ రెడ్డి, కౌన్సిల‌ర్లు మంకాల రాఘ‌వేంద‌ర్, ఆసిఫ్‌, బోయ‌ర‌విరాజు, వెంక‌న్న‌గౌడ్, మున్సిప‌ల్ అధికారులు, సిబ్బంది, నేత‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.