schedule Sunday, July 05, 2026

మహిళల దేవుడు సీఎం కేసీఆర్

calendar_today September 29, 2022
person dharshininews
మహిళల దేవుడు సీఎం కేసీఆర్
మహిళల దేవుడు సీఎం కేసీఆర్ - మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ - గాంధీనగర్లో బతుకమ్మ చీరల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ మహిళలకు దేవుడు అయ్యారని తాండూరు మున్సిపల్ 20 వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు. గురువారం గాంధీ నగర్ లోని రేషన్ దుకాణంలో మహిళలకు బతుకమ్మ చీరలను ఆమె పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసిఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కీసిఆర్ కిట్, అమ్మ ఒడి తదితర పథకాలు అమలు చేశారని అన్నారు. అదేవిదంగా ప్రతి బతుకమ్మ పండగకు మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ సంతోషం పంచుతున్నారని అన్నారు. అందరు పండగను ఉత్సాహంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు, వార్డు ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.