schedule Sunday, July 05, 2026

మార్మోమోగిన వాల్మీకీ నామ‌స్మ‌ర‌ణ‌

calendar_today October 9, 2022
person dharshininews
మార్మోమోగిన వాల్మీకీ నామ‌స్మ‌ర‌ణ‌
మార్మోమోగిన వాల్మీకీ నామ‌స్మ‌ర‌ణ‌ - తాండూరులో వైభవంగా జయంతి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని మహర్షి వాల్మీకీ దేవాలయం జయ జయ ద్వానాలతో మార్మోగింది. ఆదివారం తాండూరులో బోయ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వాల్మీకినగర్లో ప్రతిష్టించిన వాల్మీకి దేవాలయంలో మహర్షికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా వాల్మీకి మహర్షం జయంతి సందర్భంగా పలువురు నాయకులు దేవాలయాన్ని సందర్శించి వాల్మీకి మహర్షికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్య బోయ వాల్మీకీ సంఘం నాయకులు, సంఘం ప్రతినిధులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.