schedule Friday, July 10, 2026

అర్ధరాత్రి కుండపోత..!

calendar_today October 10, 2022
person dharshininews
అర్ధరాత్రి కుండపోత..!
అర్ధరాత్రి కుండపోత..! - తాండూరులో కురిసిన భారీ వర్షం - మళ్లీ నీటమునిగిన మిత్రా నగర్, గ్రీన్‌సీటీ కాల‌నీలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి అర్ధరాత్రి ముగింపు వరకు భారీ వర్షం కురిసింది. జోరువానగా ప్రారంభమై కుండపోతగా మారింది. ఏకదాటిగా కురిసిన వర్షంలో రోడ్లన్ని జలమయం అయ్యాయి. తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గం పూర్తిగా జలదిగ్బందం అయ్యింది. అర్ధరాత్రి త‌రువాత‌ ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. అదేవిధంగా తాండూరు మున్సిపల్ పరిధిలోని మిత్రానగర్, గ్రీన్ సిటీ కాలనీలు మళ్ళీ నీట మునిగిపోయాయి. గ‌తంలో కూడ ఆయా కాల‌నీలో వ‌ర్ష‌పు నీరు వ‌ర‌ద‌లా ఇండ్ల‌లోకి వ‌చ్చాయి. తాజాగా కురిసిన వ‌ర్షంతో ఆయా కాలనీలోనిలో తట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండుకున్నాయి. పలు ఇండ్లలోకి నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకుల నిర్లక్ష్యంపై మరోసారి కాలనీ వాసులు విమ‌ర్శ‌లు చేశారు. మరోవైపు పట్టణంలోని సాయిపూర్, ఇందిరా నగర్, మల్ రెడ్డిపల్లి తదితర కాలనీలో కూడ వర్షపు నీరు నిండుకున్నాయి. నేడు, రేపు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారుల ప్రకటనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.